ఢిల్లీలో రెచ్చిపోయిన దుండగులు


ఢిల్లీలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. వారి నుంచి ఆ వ్యక్తి తప్పించుకునేందుకు ఓ ఇంట్లోకి పరుగులు తీశాడు. కారులో వచ్చిన దుండగులు  స్కూటీపై వెళ్తున్న బాధితుడిని డ్యాష్ కొట్టారు. ఆ తర్వాత కాల్పులకు దిగారు. ఈ విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఢిల్లీలోనే  ఇలాంటి ఇన్సిడెంట్ మరొకటి జరిగింది. ఓవ్యక్తిని అతని ఆఫీస్ లోనే చితకొట్టారు దుండగులు. ఆఫీస్ లో ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిపై దుండగులు గుంపుగా వచ్చి దాడి చేశారు. ఈ విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates