ఢిల్లీలో విషాదం : అపార్ట్ మెంట్ లో మంటలు… నలుగురు మృతి

apar దేశ రాజధాని ఢిల్లీలో విషాద సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని కోహాట్‌ ఎన్‌క్లేవ్‌ లోని నాలుగంతస్తుల బిల్డింగ్ లో ఈ రోజు(ఏప్రిల్-13) తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

తెల్లవారుజామున  3 గంటల సమయంలో బిల్డింగ్ పార్కింగ్‌ ఏరియాలో మంటలు చెలరేగినట్లు తమకు ఫోన్‌ వచ్చిందని తెలిపారు ఫైర్ ఇంజిన్ సిబ్బంది.  వెంటనే పది ఫైర్ ఇంజిన్ల సాయంతో అక్కడికి చేరుకుని  మంటలు అదుపులోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో వీరందరూ ఫస్ట్ ఫ్లోర్ లోని వాళ్ల  ఫ్లాట్‌లో నిద్రపోతున్నారు. మంటలను గమనించి… బయటకు వచ్చేందుకు వారు ప్రయత్నించారు.  అయితే గది అంతా విపరీతంగా పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates