ఢిల్లీలో హై అలర్ట్ : ఉగ్రదాడిపై..నిఘావర్గాల హెచ్చరిక

స్వాతంత్ర్యదినోత్సం సందర్భంగా ఆగస్టు 15లోపు.. ఢిల్లీలో ఉగ్రవాదులు దాడి చేయనున్నట్లు నిఘావర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిపారు పోలీసులు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం (జూలై-19) హై అలర్ట్ ప్రకటించారు.  ఆగస్టు 15న జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలో దాడిచేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని తెలిపిన పోలీసులు.. దేశ రాజధానిలోని ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పట్టాలని సెక్యూరిటీని అప్రమత్తం చేశారు.

ఇటీవల అరెస్టు అయిన ఉగ్రవాదులు సయ్యద్ మునీర్ ఉల్ హసన్ ఖాద్రీ, ఆసీఖ్ బాబా, తరీఖ్ అహ్మద్ దార్ నుంచి ఈ సమాచారాన్ని రాబట్టినట్లు నిఘా వర్గాలు తెలిపాయన్నారు.  2016లో నగ్రోటా ఆర్మీ క్యాంపుపై దాడి చేసి ఏడుగురు జవాన్లను హత్య చేసిన కేసులో ఈ ముగ్గురు ఉగ్రవాదులను ..జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకొని విచారించింది. ఉగ్రవాది బుర్హాన్ వానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఢిల్లీలోని రద్దీ ఉన్న ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. దీంతో గురువారం నుంచి ఎర్రకోట వద్ద భద్రతా బలగాలు నిఘా పెట్టాయి.

Posted in Uncategorized

Latest Updates