ఢిల్లీలో హై అలర్ట్ : దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు

JAMMUపాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి జమ్మూ-కశ్మీర్ లోకి ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చొరబడినట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం (జూన్-1) జమ్మూ-కశ్మీర్ తో పాటు న్యూఢిల్లీలోనూ హై అలర్ట్ ప్రకటించింది హోం శాఖ. పీవోకే నుంచి నియంత్రణ రేఖ దాటుకుని 20 మంది టెర్రరిస్టులు.. కశ్మీర్ లోకి చొరబడ్డారని అనుమానిస్తున్నారు.

చొరబడ్డ ఉగ్రవాదుల్లో జైష్ ఏ మహ్మద్ టెర్రర్ గ్రూప్ కు చెందిన వాళ్లే అయ్యి ఉంటారని కేంద్ర హోంశాఖ అంచనా వేస్తోంది. భద్రతా సిబ్బంది జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిరంతరం నిఘా ఉంచాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది హోంశాఖ. సున్నితమైన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఒకేసారి ఇంతమంది టెర్రరిస్టులు చొరబడటం అరుదని అధికారులు వెల్లడించారు. కశ్మీర్లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. పుల్వామాలో మూడు అనుమానాస్పద బ్యాగులను గుర్తించాయి భద్రతా దళాలు. అందులో IED బాంబులున్నట్లు నిర్థారించారు. ఆ బాంబులను నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం.. ఈలోపు IED బాంబులను గుర్తించటం ఒకేసారి జరగటంతో.. దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. అంతకుముందు 183 CRPF బెటాలియన్ కు చెందిన బంకర్ వెహికిల్ పై టెర్రరిస్టులు దాడి చేశారు. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates