ఢిల్లీలో 36 ఆవులు మృతి : విచారణకు ఆప్‌ సర్కారు ఆదేశాలు

ఢిల్లీలోని చౌలా ఏరియాలోని ఓ గోశాలలో శుక్రవారం (జూలై-27) 36ఆవులు చనిపోయాయి. రెండు రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోవడంతో  తీవ్ర దుమారం రేపుతోంది. దాంతో విచారణకు ఆదేశించించింది ఢిల్లీ ప్రభుత్వం. 24గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించించింది. వెటర్నరీ డాక్టర్ల టీమ్ గోశాలను సందర్శించింది.

చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించి.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు డాక్టర్లు. నీళ్లు లేకపోవడంతోనే ఆవులు చనిపోయినట్లు చెబుతున్నారు గోశాలలో పనిచేసే వర్కర్లు. వాటర్ మోటర్ పనిచేయడం లేదని.. ఎవరికి చెప్పినా పట్టించుకోలేదంటున్నారు. కనీసం డాక్టర్ కూడా అందుబాటులో లేడని చెప్పారు.

ఈ గోశాలను శుభ్రం చేసేందుకు ఢిల్లీ మున్సిపల్‌ కార్మికులు తరచుగా ఇక్కడికి వస్తూ ఉండటం.. ఢిల్లీ వాటర్‌ బోర్డు నీటిని సరఫరా చేస్తుండటంతో ఢిల్లీ సర్కారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో వెటర్నరీ డాక్టర్ల బృందాన్ని గోశాలకు పంపించింది. ఆవుల మృతికి గల కారణాలపై విచారణ జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన  ఈ గోశాలను 1995లోప్రారంభించినట్లు తెలిపారు ట్రస్టు సభ్యులు.

 

Posted in Uncategorized

Latest Updates