ఢిల్లీ గుర్తు చేసిన విషాదం : అప్పట్లో 900 మంది ఒకేసారి ఆత్మహత్య

jyఆదివారం(జులై-1) ఢిల్లీలోని ఓ ఇంట్లో ఒకే కుటంబానికి చెందిన 11 మంది మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆధ్యాత్మిక కారణాలతో మోక్షం సిద్దిస్తుందని నమ్మి వీరందరూ చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే…. ఇదేం కొత్తగా జరిగిన సంఘటన కాదు. 1978 లో ఓ సంప్రదాయ గురువు వందలాదిమంది ప్రజలను విషం తీసుకోవాలని ఆదేశించాడు. దీంతో 900 కు పైగా ప్రజలకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 200 మంది చిన్నారులు కూడా ఉన్నారు.

1978 లో అమెరికాలో పీపుల్స్ టెంపుల్ ఫౌండర్, ఆధ్యాత్మిక గురువు జిమ్ జోన్స్  ఇచ్చిన ఆదేశాలను నమ్మి 900 మంది విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అమెరికాలోని జోన్స్ టౌన్ లో ఈ ఘటన జరిగింది. 900 కు పైగా ఈ ఘటనలో చనిపోయారని, ఎక్కువగా చిన్నారులే చనిపోయినట్లు ఎఫ్ బీఐ ప్రకటించింది. జిమ్ జోన్స్ కూడా తన తుపాకీతో తలపై కాల్చుకొని చనిపోయాడు. 2001, సెప్టెంబర్-11 కు ముందు  అమెరికా చరిత్రలోనే ఒక అసహజ ఘటనలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనగా దీనికి రికార్డు ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates