ఢిల్లీ గ్యాంగ్ వార్ : 10 కి.మీ. ఛేజింగ్.. కాల్పులు.. హాలీవుడ్ మూవీ సీన్..

delhi-gang-warదేశ రాజధాని ఢిల్లీలో హాలివుడ్ యాక్షన్ మూవీ లైవ్ కనిపించింది. ఛేజింగ్స్, కాల్పులతో రోడ్లు దద్ధరిలిల్లాయి. జూన్ 18వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలు. ఎవరి పనులపై వాళ్లు వెళుతూ హడావిడిగా ఉన్నాయి ఢిల్లీ వీధులు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సంతన్ నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు తేరుకునేలోపు కాల్పుల మోత.. ఛేజింగ్స్.. బీభత్సం.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో జితేంద్రగొగయ్ గ్యాంగ్ – టిల్లు తజ్జుపులియా గ్యాంగ్స్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ గ్యాంగ్స్ మధ్య ల్యాండ్ సెటిల్ మెంట్ల విషయంపై వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే.. టిల్లు గ్యాంగ్ సంతన్ నగర్ లోని ఓ జిమ్ నుంచి బయటకు వచ్చింది. తమ ఫార్చ్యునర్ కారులో ఎక్కారు రౌడీలు.. అప్పటికే కాపు కాసి ఉన్న జితేంద్ర గొగయ్ గ్యాంగ్ ఒక్కసారిగా ఎటాక్ చేసింది. గన్ ఫైర్ ఓపెన్ చేసింది. దీంతో అలర్ట్ అయిన టిల్లు గ్యాంగ్.. కారులో తప్పించుకోవటానికి స్పీడ్ పెంచింది. ఈ వెనకే జితేంద్ర గొగయ్ గ్యాంగ్ వారిపై కాల్పులు జరుపుతూ వెంటపడ్డారు.

టిల్లు గ్యాంగ్ కారును..  జితేంద్ర గ్యాంగ్ వెంటాడే ఛేజింగ్ సీన్ 10 కిలోమీటర్లు సాగింది. రన్నింగ్ లోనే ఒకరిపై ఒకరు కాల్పులు. రోడ్లపై హాలివుడ్ మూవీ యాక్షన్ సీన్ నడిచింది. గ్యాంగ్ వార్ కాల్పుల్లో టిల్లు గ్యాంగ్ లోని సన్నీ అనే రౌడీ చనిపోగా, జితేంద్ర గొగయ్ గ్యాంగ్ లో రాజు అనే యువకుడు చనిపోయాడు. రోడ్లపై కాల్పులు జరుపుతూ వెళ్లటంతో ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన బస్సు కోసం వెయిట్ చేస్తున్న సంగీత అనే యువతికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆ యువతి స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మరో ఇద్దరికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. వీరు ఢిల్లీలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 25 రౌండ్ల కాల్పులు జరిగాయి. టిల్లు గ్యాంగ్ ఫార్య్చునర్ కారును.. షాలిమార్ బాగ్ ఏరియాలో లీసులు స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates