ఢిల్లీ డెత్ మిస్టరీ : 12వ వ్యక్తి కూడా ఉన్నాడా.. అతనే చంపేశాడా?

Burari-Caseకళ్లు, ముక్కు, నోరూ మూసుకుని, చేతులు వెనక్కి కట్టుకుని ఆత్మహత్య చేసుకుంది ఢిల్లీలోని భాటియా కుటుంబం. ఆత్మహత్యకు ముందు ఇంట్లో ‘వటవృక్ష’ పూజ నిర్వహించారు. మామూలుగా పూజారుల సమక్షంలోనే ఇలాంటి పూజ జరుగుతుంది. అంటే బయట వ్యక్తి ఎవరో ఉన్నాడు.. ఎవరా 12వ వ్యక్తి.. ఇప్పుడు ఇదే ఈ డెత్ మిస్టరీ వీడటానికి కీలంగా మారుతుంది. బయటి నుంచి వచ్చిన వ్యక్తే.. ఈ పూజ నిర్వహించి ఉంటాడని భావిస్తున్నారు. మోక్షం కోసం భగవంతుడ్ని చేరేందుకు దగ్గరి దారి ఇదేనని ప్రలోభానికి గురి చేసి ఉంటారా అ‍న్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అన్నింటి కంటే ముఖ్యంగా.. మెయిన్ డోర్ తెరిచి ఉండటంతో పూజ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఇటు నుంచే వెళ్లి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాటియా కుటుంబం తరచూ ఇలాంటి పూజలు నిర్వహించే వారని తెలుస్తోంది. కొందరు స్వామీజలు వీరి ఇంటికి వచ్చే వారని గతంలో ఇంట్లో పని చేసిన వారు చెబుతున్నారు. దీంతో 12వ వ్యక్తి మిస్టరీ చేధించే పనిలో పడ్డారు పోలీసులు.

2007లో నారాయణ్ దేవి భర్త చనిపోయాడు. ఆయన మరణాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె చిన్న కుమారుడు లలిత్ భాటియా మానసిక స్థితి దెబ్బతింది. తండ్రి ఫొటోతో మాట్లాడడం, ఆయన ఆదేశాలు ఇచ్చాడంటూ వాటిని ఓ పుస్తకంలో రాయడం చేస్తుండేవాడు. తండ్రి కలలో కనిపించాడని, మాట్లాడాడని.. ఆయన ఆత్మ ఆవహించిందని చెబుతూ కుటుంబ సభ్యులను కూడా అదే దారిలో నడిపించాడు. అది కాస్తా ఇతర కుటుంబ సభ్యులకు అంటుకుంది. చివరి సమయంలో మన కోర్కెలు నెరవేరేటప్పుడు ఆకాశం బద్దలవుతుందని, భూమి కంపిస్తుందని.. అయినా ఎవరూ భయపడొద్దని.. నేనొచ్చి రక్షిస్తానని పుస్తకాల్లో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు.. వీలైనంత త్వరలో కేసులో మిస్టరీని చేధిస్తామన్నారు. మరోవైపు భాటియా ఇంట్లో దొరికిన నోట్‌ బుక్‌లను విశ్లేషించిన మానసిక నిపుణులు.. వాటిని అధ్యయనం చేసే పనిలో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates