ఢిల్లీ బురారీనే గుర్తుకొస్తోంది : రాంచీలో ఓ ఫ్యామిలీ మొత్తం సూసైడ్

ఢిల్లీలోని బురారీ ఏరియాలోని ఓ ఇంట్లో నెల రోజుల క్రితం 11 మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన ఇంకా దేశ ప్రజలు మర్చిపోకముందే సోమవారం (జులై-30) జార్ఖండ్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బీహార్ లోని బగల్ పూర్ కి చెందిన దీపక్ జా(40) కుటుంబం రాంచీలోని కనకే ఏరియాలో అద్దె ఇంట్లో  నివసిస్తుంది. కొంతకాలంగా వీరు ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదు. బంధువులకు కూడా దూరంగా ఉంటున్నారు. ఏమైందో ఏమోగానీ.. దీపక్ జా కుటుంబం మెత్తం ఆత్మహత్య చేసుకుంది. ఏడుగురు కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరికి ఉరి వేసిన తర్వాత.. పెద్దలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. వీరి ఆత్మహత్యల వెనక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. విచారణ జరుగుతోందని.. ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ అనిస్ గుప్తా తెలిపారు. ఈ నెల మొదటివారంలో కూడా రాంచీ సిటీకి 96 కిలోమీటర్ల దూరంలోని హజరిబాగ్ ఏరియాలో కూడా ఓ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఏడుగురు సభ్యుల కుటుంబం సూసైడ్ చేసుకుంది. ఈ రెండు ఘటనలు కూడా ఢిల్లీలోని బురారీ ఏరియాలో 11మంది సభ్యుల ఫ్యామిలీ ఆత్మహత్యను గుర్తు చేస్తుంది. ఢిల్లీ బురారీ కేసులో ఇప్పటికీ పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉంది. సామూహిక ఆత్మహత్యలు చేసుకోవటంపై ఆందోళన నెలకొంది. ఇలా కుటుంబాలు.. కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవటం మరీ దారుణం అంటున్నారు. ఇలాంటి ఆలోచనలు మంచివి కావని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates