ఢిల్లీ రికార్డు బద్దలు కొడతారు : కేజ్రీవాల్

kejriwalkamalఢిల్లీ ప్రజలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ను తిరస్కరించి..ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజలు తమకు రికార్డు స్థాయిలో 67 సీట్లు ఇచ్చి అధికారమిచ్చారని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. సినీ నటుడు కమల్‌హాసన్ మధురైలో తన పార్టీ పేరును మక్కల్ నీధి కయ్యమ్‌ గా ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరైన సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల నుంచి తమకు వచ్చిన స్పందనను తాను ఇక్కడ కూడా చూస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు ప్రజలు కచ్చితంగా ఢిల్లీ ప్రజల రికార్డును బ్రేక్ చేసి మక్కల్ నీధి కయ్యమ్ పార్టీకి అవకాశమిస్తానని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates