ఢిల్లీలో పెరగనున్న వాహనాల ధరలు

ఢిల్లీలో వాహనాల రేట్లు మరింత పెరగనున్నాయి. వన్ టైమ్ పార్కింగ్ చార్జీలను 18 శాతం పెంచుతూ రాష్ట్ర రవాణా శాఖ ఆర్డర్స్ పాస్ చేసింది. జనవరి 1, 2019  నుండి పెరిగిన చార్జీలు అమలులోకి రానున్నాయి.   పార్కింగ్, మౌలికసదుపాయాలు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ తెలిపింది. వాహనాలు కొనే సమయంలోనే ఈ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేట్ కార్లు కొనేటప్పుడు వన్‌టైం పార్కింగ్‌ ఛార్జీల మినిమమ్ ధర రూ.4వేలు ఉండగా.. జనవరి 1 నుండి రూ.6వేలు చెల్లించాలి.

చార్జీలు కారు ధరను బట్టి 6 వేల నుండి 75 వేల వరకు ఉండనున్నాయి. కమర్షియల్ వాహనాలపై ప్రస్తుత చార్జీలు రూ.2,500 నుండి రూ.4వేలు గా ఉంది. పెరిగిన చార్జీల ప్రకారం 10 వేల నుండి 25 వేల వరకు పెంచారు. దీనిపై రవాణా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలోనే ఢిల్లీ సీఎంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ ను కలువనున్నట్లు తెలిపాయి.

Posted in Uncategorized

Latest Updates