ఢిల్లీ విమానాశ్రయానికి 16వ స్థానం

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల లిస్టులో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టు (IGIA) 16వ స్థానం సాధించింది. వార్షిక ప్రాతిపదికన అత్యధిక ప్రయాణికులకు సేవలందిస్తున్న 20 ఎయిర్ పోర్టుల లిస్టును అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి (ACI) ప్రకటించింది. 2016లో 22వ స్థానంలో ఉన్న IGIA నుంచి 2017లో 6.34 కోట్ల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. వరల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ట్రాఫిక్‌ నివేదిక ప్రకారం అమెరికాలోని అట్లాంటా హార్ట్స్‌ఫీల్డ్‌-జాక్సన్‌ విమానాశ్రయం 10.39 కోట్ల మంది ప్రయాణికులతో మొదటి స్థానంలో నిలిచింది.

Posted in Uncategorized

Latest Updates