ఢిల్లీ వెళ్లింది వ్యక్తిగత పనుల కోసమే : డీఎస్

dsతాను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే కారణంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనడం దురదృష్టకరమన్నారు టీఆర్ఎస్ సీనియర్ నేత డీఎస్. క్రమశిక్షణ గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఓ పద్ధతి ప్రకారం ఉంటానన్నారు. అలాంటి తనపై ఆరోపణలు సరికాదన్నారు. ఈ పరిణామాలపై తనతో మాట్లాడితే సరిపోయేదన్నారు డీఎస్. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే అని చెప్పారు. తన కొడుకు ఇండిపెండెంట్ అని… ఆయనకు స్వతంత్రంగా నిర్ణయాలుంటాయన్నారు. ఈ స్థాయి వరకు తనపై లేఖ రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఎంపీ కవితను, ఎమ్మెల్యేలను అడగాలన్నారు డీఎస్. వ్యక్తిగత పని మీద ఢిల్లీకి వెళ్ళానన్న ఆయన….అక్కడ తన క్వార్టర్ రిపేర్ పని చూసుకొని వచ్చానన్నారు. ఐనా ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నేతలు కాక ఇంకెవరు కనిపిస్తారని ప్రశ్నించారు. ఐతే తాను ఆజాద్ ను కలిశానని చెప్పటం పచ్చి అబద్ధమన్నారు. తాను TRS లోకి లోకి వచ్చాక రాజకీయ నేతలను కలవటమే మానేశానన్నారు డి.శ్రీనివాస్.

 

Posted in Uncategorized

Latest Updates