ఢిల్లీ సీఎంపై కేంద్రమంత్రి కామెంట్ : పనిలో జీరో..ధర్నాలు చేయడంలో హీరో

DELHI CMపనిచేయడంలో జీరో.. ధర్నాలు చేయడంలో హీరో అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సెటైర్ వేశారు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందిగా కేజ్రీ వారం రోజులుగా ధర్నా చేస్తున్నారు. వారం రోజులైనా సమస్య పరిష్కారం కాలేదు.

పైగా ఐఎఎస్ అధికారులంతా కలిసి అడ్మినిస్ట్రేషన్ నడుస్తోందని.. కేజ్రీవాల్ కావాలనే షో చేస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని.. పనిచేయాల్సింది పోయి ధర్నాతో టైం వేస్ట్ చేస్తున్నారని విమర్శించారు నఖ్వి. హంగామాతో పనులు కావని… ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం అంత ఈజీ కాదన్నారాయన.

Posted in Uncategorized

Latest Updates