ఢిల్లీ హోటల్ ఘటన…కోర్టులో లొంగిపోయిన మాజీ ఎంపీ కొడుకు

ఢిల్లీలోని హయత్ రీజన్సీ హోటల్ దగ్గర తుపాకీతో దంపతులను భయపెట్టిన బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్‌ పాండే కుమారుడు ఆశిష్‌‌ పాండే న్యాయస్థానంలో లొంగిపోయారు. పటియాలా హౌస్ కోర్టులో ఆయన గురువారం జడ్జి ఎదుట లొంగిపోయారు.ఆశిష్ ను నాలుగురోజులు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోర్టుని ఢిల్లీ పోలీసులు కోరారు. అయితే కోర్టు ఆశిష్ కు ఒక రోజు రిమాండ్ విధించింది. ఆశిష్ పాండేకు వ్యతిరేకంగా బుధవారం పటియాలా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విసయం తెలిసిందే.

తనను ఓ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారని, దేశ వ్యాప్తంగా పోలీసులు తన కోసం గాలిస్తున్నారని ఈ సందర్భంగా ఆశిష్ తెలిపారు. నా కోసం లుక్ అవుట్ సర్య్యూలర్ ఇష్య్యూ చేశారు, సీసీ టీవీ ఫుటేజీ చూస్తే ఆ రోజు రాత్రి ఎవరు లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లారనేది, ఎవరు ఎవరిని బెదిరించారనేది తెలుస్తుందని ఆయన అన్నారు. ఆరోజు రాత్రి జరిగిన ఘటనలో తన తప్పేమి లేదని తెలిపాడు. భద్రత కోసమే తుపాకీని వెంట తెచ్చుకున్నట్లు తెలిపాడు. ఓ యువతిని తుపాకీతో బెదిరించానని వార్తలు వచ్చాయి. అసలు ఆ యువతి ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె నన్ను తోసేసి, నా పట్ల అనుచితంగా ప్రవర్తించింది. చేతితో అసభ్యకర సంజ్ఞలు చేసింది. న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది. అందుకే లొంగిపోవాలని నిర్ణయించుకున్నాను. నాపై ఇప్పటి వరకు ఎటువంటి పోలీసు కేసులు లేవు అని ఆశిష్‌ పాండే తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates