ఢిల్లీ 11 డెత్ మిస్టరీ : చనిపోయే ముందు అందరూ రొట్టెలే తిన్నారు

deathఢిల్లీలో 11 మంది ఫ్యామిలీ డెత్ మిస్టరీని పోలీసులు చేధించే పనిలో పడ్డారు. హత్యనా..ఆత్మహత్యనా అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్స్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే చనిపోయేముందు వారు రొట్టెలను ఆర్డర్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆ డెలివరీ బాయ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆ ఫ్యామిలీని చివరిసారిగా చూసింది వాళ్లకు ఫుడ్ డెలివరీ చేసింది రిషీ అనే డెలివరీ బాయ్. ఉరి వేసుకున్న భాటియా ఫ్యామిలీ ఆ రోజు రాత్రి 10.30 నిమిషాలకు 20 రోటీలు కావాలంటూ ఆర్డర్ చేశారు. ఆ రోటీలను డెలివరీ చేసేందుకు 10.45కు వాళ్ల ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు డెలివరీ బాయ్ రిషీ. భాటియా కుమార్తె రోటీలను పికప్ చేసుకుందని, తండ్రిని బిల్లు కట్టుమంటూ ఆమె సూచించిందని డెలివరీ బాయ్ చెప్పాడు. జూలై ఒకటో తేదీన జరిగిన సంచలన సామూహిక ఆత్మహత్య కేసులో ఆ ఇంటి వ్యక్తులను చివరిసారిగా చూసింది ఈ కుర్రాడే.

బురారీ ప్రాంతంలో ఉన్న భాటియా ఇంటికి క్రైం బ్రాంచ్ పోలీసులు వెళ్లారు. అక్క‌డ ఉన్న క్లూస్‌ను సేక‌రించారు. మ‌రో వైపు పోలీసుల వాద‌న‌ను కుటుంబ‌స‌భ్యులు కొట్టిపారేస్తున్నారు. భాటియా కుటుంబం మ‌త‌విశ్వాసాల‌కు క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని, కానీ మీడియాలో వ‌స్తున్న‌ట్లు తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించ‌లేద‌ని బంధువు సుజాత తెలిపారు. 11 మంది మ‌ర‌ణం వెనక కుట్ర ఉంద‌ని, భాటియా ఇంట్లో ఉన్న పైపులు సోలార్ ప్రాజెక్టు కోసం తెచ్చార‌ని ఆమె తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates