ఢిల్లీ, UP, హిమాచల్ లో భారీవర్షాలు

దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి. అక్కడి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.  ఢిల్లీలో గురువారం(జూలై-26) నుంచి కురుస్తున్న వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చాలో చోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది వరద నీటిని తొలగించే పనిలో ఉన్నారు. డ్రైనేజీలకు నీటిని మళ్లించడంతో పాటు.. మోటర్లు పెట్టి నీటిని తొలగిస్తున్నారు. మరోవైపు.. వర్షపు నీరు రోడ్డుపై నిలవడంతో..  నొయిడా హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates