తండ్రికి అంత్యక్రియలు: కన్నరుణం తీర్చుకున్న కూతుళ్లు

WWతమ తర్వాత వంశం అంతరించి పోకుండా…పున్నామ నరకం నుంచి తప్పించేందుకైనా మగ సంతానం కావాలనుకుంటారు కొందరు తల్లిదండ్రులు. అయితే మగ సంతానం లేని ఓ తండ్రి చనిపోతే అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు కూతుళ్లు. ఆరుగురు కూతుళ్లలో పెద్ద కూతురు అగ్గిపట్టగా.. మిగతా వాళ్లు పాడె మోసి కన్న తండ్రి రుణం తీర్చుకున్నారు. మానవ సంబంధాలకు నిదర్శమైన ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట లో జరిగింది. దమ్మన్న పేటకు చెందిన 60 ఏళ్ల దుబ్బయాకయ్య సైకిల్ షాపు నిర్వహించే వాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ముగ్గురు కుమార్తెలు..చిన్న భార్యకు ముగ్గురు కుమార్తెలున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న యాకయ్య చనిపోయాడు. ఆరుగురు కుమార్తెల్లో పెద్ద కూతురు సలీమా తండ్రికి తలకొరివి పెట్టింది.

Posted in Uncategorized

Latest Updates