తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతుళ్లు

జగిత్యాల : కంటే కూతుర్నే కనాలిరా అనే పదానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి నలుగురు కూతుళ్లు అంత్యక్రియలు చేశారు. కొడుకులు చేయాల్సిన అంత్యక్రియ కార్యక్రమాలన్నీ కూతుర్లే చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వాణి నగర్ కు చెందిన కంకునాల బాపురావు (55)అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు., ఆసుపత్రి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బాపురావుకు నలుగురు కూతుర్లే. ఎవ్వరికీ పెళ్లి కాలేదు. తండ్రి అంత్యక్రియలు కూతుర్లే చేయడం స్థానికులను కలిచివేసింది. పాడె మోశారు. ఓ కూతురు తలకొరివి పెట్టింది. మరో కూతురు చితికి నిప్పంటించింది.  బాపురావుకు భార్య లలిత నలుగురు కూతుర్లు భవిత, సాహిత్య, మేఘన, శివాని ఉండగా పెద్ద కూతురు భవిత. ఇంటికి పెద్ద దిక్కు పోవడంతో వారిని చూసినవారంతా కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Latest Updates