తండ్రిని హత్య చేసిన కొడుకు

  • తల్లిని చంపాడన్న కోపంతో

తల్లిని చంపాడన్న కోపంతో ఓ వ్యక్తి తన తండ్రిని హతమార్చాడు. నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. పోలీసులు చెప్పిన ప్రకారం.. ఎల్లారెడ్డి పల్లిలో కుంట గంగా బాపు(50) అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం తన భార్య  కుంట విజయను రోకలి బండతో కొట్టి చంపాడు. ఆ కేసులో గంగా బాపు జైలుకి వెళ్లాడు.  సోమవారం బెయిలుపై  విడుదలైన గంగా బాపు అదే రాత్రి ఎల్లారెడ్డి పల్లికి చేరుకున్నాడు. తన తల్లిని హత్య చేశాడని కోపంగా ఉన్న అతని చిన్న కొడుకు  ప్రశాంత్ గంగా బాపును హత్య చేసి పోలీస్ స్టేషన్లో లోంగిపోయాడు. ఈ హత్య చేసేందుకు ప్రశాంత్​కు అతడి బావ, స్నేహితుడు సహకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాజశేఖర్​తెలిపారు. కాగా, గడిచిన నాలుగు నెలల్లో యెల్లారెడ్డి పల్లి గ్రామంలో ఇది 3వ హత్య. గంగా బాపు తన భార్యను చంపి జైలుకి వెళ్లాడు  సొమవారం బెయిల్ పై వచ్చి అతనూ హత్యకు గురయ్యాడు.

Latest Updates