తండ్రి చేతిలో దాడికి గురైన బాలుడు మృతి

హైదరాబాద్ : కూకట్‌పల్లి KPHB కాలనీలో సోమవారం తండ్రి చేతిలో హత్యాయత్నానికి గురైన బాలుడు చరణ్ గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం రాత్రి చదువుకోవటం లేదంటూ చరణ్ (12)పై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు తండ్రి బాలు. ఇప్పటికే తండ్రిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు పోలీసులు. చరణ్ స్వగ్రామం జొన్నలవడ, పెద్దకొత్తపల్లి, నాగర్ కర్నూలు జిల్లా. కొంత కాలంగా చరణ్ ఫ్యామిలీ కూకట్ పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చిన్న గుడిసె వేసుకుని స్కూల్ పనులు చూసుకొంటు ఉంటున్నారు. చరణ్ చాలా చురుగ్గా అందరి పనులు చేస్తూ చలాకీగా ఉండేవాడు.

స్కూల్ టీచర్ల దగ్గర కూడా మంచి బాలుడు అని పిలిపించుకొన్నాడు. తండ్రి మాట పెద్దగా పట్టించుకొనేవాడు కాదు. తండ్రి బాలుకు కూడా పిల్లలపై ప్రేమ ఎక్కువే అని బంధువులు తెలిపారు. క్షణికావేశంలో బాలు చేసిన పనికి చరణ్ బలి అయిపోయాడన్నారు. బంధువులు ఎవరు రాక పోవడంతో గాంధీలొనే చరణ్ తల్లి సోను పిల్లలతో ఉంది. దహన సంస్కారాలకు తండ్రి రావాలని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చరణ్ చికిత్స పొందుతున్న సమయంలో తన తండ్రిని చూడాలని వేడుకున్నాడని తెలిపారు డాక్టర్లు. ఇంతలోనే చనిపోయాడన్నారు.

Latest Updates