తక్కువ ధరే అంట : డ్యూయల్ సిమ్ తో ఐఫోన్లు

appeసాఫ్ట్‌వేర్ దిగ్గజం యాపిల్‌  ఐఫోన్లంటే స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. వీటిని ఎప్పుడెప్పుడు కొందామా అని ఆలోచిస్తుంటారు. కొత్త వెర్షన్ వచ్చిందంటే.. ముందురోజు నుంచే క్యూలైన్లో నిలబడతారు. గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 10 ఆశించినంత స్థాయిలో సేల్స్ జరగలేదు. ఈ ఫోన్ ధర మరీ ఎక్కువగా ఉండడమే కారణం. దీంతో ఈ ఏడాది విడుదల చేయనున్న కొత్త ఐఫోన్ మోడల్‌ను అత్యంత తక్కువ ధరకే అందించాలని యాపిల్ భావించింది. ఈ ఐఫోన్లలో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ అందించనుంది. తక్కువ ధరకే ఐఫోన్‌ను అందించడంతోపాటు ఐఫోన్ 10లో ఉన్న అన్ని ఫీచర్లను కొత్త ఐఫోన్‌లో అందించనుంది.

కొత్తగా విడుదల చేయనున్న బడ్డెట్ ఐఫోన్ మోడల్స్ లో LED డిస్‌ప్లేకు బదులుగా సంప్రదాయ LCD డిస్‌ప్లే ఏర్పాటు చేయనుంది. బాడీని అల్యూమినియంతో కాకుండా ప్లాస్టిక్‌తో తయారు చేస్తుంది. డిస్‌ప్లే టైప్ ఎడ్జ్ టు ఎడ్జ్ మాదిరి ఉంటుందని.. సైజ్ 6.5 ఇంచ్ వరకు ఉండనుంది. దీని వల్ల ఫోన్ ధర బాగా తగ్గుతుందని చెబుతోంది కంపెనీ. ధర తక్కువగా ఉండటంతో.. రెస్పాన్స్ బాగుంటుందని యాపిల్ భావిస్తుంది. ఇక బడ్జెట్ ఐఫోన్‌తోపాటు ఐఫోన్ 10ను పోలిన విధంగా ఉండే మరో హైఎండ్ ఫోన్‌ను కూడా యాపిల్ ఈ ఏడాది విడుదల చేయనుంది. దీని డిస్‌ప్లే సైజ్ 5.8 ఇంచుల వరకు ఉండనుంది.

Posted in Uncategorized

Latest Updates