తక్కువ మందితో ఎక్కువ వ్యాపారమే ”టీ రిచ్‌”: కేటీఆర్‌

ktr1తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చేయడమ లక్ష్యంగా టీ రిచ్‌ను ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్ శనివారం(ఫిబ్రవరి-24)  హైదరాబాద్ కేంద్రంగా జరిగిన టీ రిచ్‌ వార్షిక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. టీ రిచ్ ఏర్పాటు చేసిన ఏడాదిలోనే.. గొప్ప పరిశోధనలు చేసిందని తెలిపారు. రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్, ఇండస్ట్రీ, స్టార్టప్స్‌ని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకే టీ రిచ్‌ను ఏర్పాటు చేశామన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ఎన్నో ప్రభావంతమైన విధానాలు తీసుకొచ్చామన్నారు.

టీ హబ్ ఎన్నో పరిశ్రమల స్థాపనకు ఉపయోగపడిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రాష్ట్రానికే కాకుండా దేశానికి ఉపయోగపడేలా వ్యాపారులు ఎదగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అనేక మంది తోడ్పాటును అందిస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates