తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు

ఢిల్లీ :  గోల్డ్ రేట్ ఇవాళ కాస్త తగ్గింది. బుధవారం రూ.210 తగ్గడంతో.. పది గ్రాముల బంగారం ధర రూ.31,850కి చేరింది.

కిలో వెండి రేట్ లోనూ కరెక్షన్ కనిపించింది. 435 రూపాయలు తగ్గింది. తాజా తగ్గింపుతో… కిలో వెండి ధర రూ.37వేల 880కి చేరింది. డిమాండ్‌ లేకపోవడంతో.. గోల్డ్ ధర రూ.32వేలకు దిగి వచ్చింది. పెళ్లిళ్ల సీజన్‌ ముగియడంతో నగల వ్యాపారులు, తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ తగ్గిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.

 

 

Posted in Uncategorized

Latest Updates