తగ్గిన పసిడి ధర

ఢిల్లీ : బంగారం ధర తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వెళ్లిన పసిడి ధర నిన్న(శుక్రవారం) భారీగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.250 తగ్గి రూ.31,850కు చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు, స్థానిక వ్యాపారుల నుంచి కొనుగోలు డిమాండ్‌ తగ్గడంతో బంగారం ధర పతనానికి కారణమైంది. మరోపక్క వెండి కూడా కిలోకు రూ.100 తగ్గి రూ.39,250కు చేరింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వెండి ధర తగ్గుదలకు కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి.

Posted in Uncategorized

Latest Updates