తగ్గిన పెట్రో డిస్కౌంట్లు

డిజిటల్ పేమెంట్లపై ప్రోత్సాహకాలు ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పాత పెద్ద నోట్ల రద్దు సందర్భంలో క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్లు ఇతరత్రా డిజిటలైజ్డ్ సదుపాయాల ద్వారా బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కొన్న వినియోగదారులకి 0.75 శాతం చొప్పున రాయితీని ప్రకటించింది. 2016, డిసెంబర్ 13 నుంచి ఈ రాయితీలు అమల్లోకి వచ్చాయి. లీటర్ పెట్రోల్‌పై 57 పైసలు, డీజిల్‌పై 50 పైసల చొప్పున వినియోగదారులుకు డిస్కౌంట్లు అందాయి. నగదు కొరత నుంచి బయటపడటానికి, డిజిటల్ లావాదేవీలను పెంచడానికీ మోడీ సర్కారు ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ రాయితీ మూడు రోజుల్లో కస్టమర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. అయితే ఇప్పుడిది 0.25 శాతానికి పడిపోయినట్లు సమాచారం. లీటర్ పెట్రోల్‌పై దాదాపు 19 పైసలు, డీజిల్‌పై 17 పైసలకు తగ్గింది. ఈ మేరకు చమురు కంపెనీలు… పెట్రోల్ బంకుల నిర్వాహకులకు సందేశాలు పంపించింది ప్రభుత్వం. డిజిటల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను 0.75 శాతం నుంచి 0.25 శాతానికి సవరించినట్లు మీ కస్టమర్లకు తెలియజేయండి. ఆగస్టు 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించండి అని పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు రాతపూర్వక సందేశాలను పంపించారు.

2016, నవంబర్ 8 రాత్రి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు ప్రధాన మంత్రి మోడీ. ఈ సందర్భంలోనే సరిగ్గా నెల రోజుల తర్వాత 2016, డిసెంబర్ 8న డిజిటల్ చెల్లింపుల నినాదాన్ని ప్రోత్సహించింది  కేంద్ర ప్రభుత్వం. ఇదే క్రమంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపైనా అమలు పరిచింది. రోజుకు 4.5 కోట్ల మంది వినియోగదారులు రూ.1,800 కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు జరుపుతున్నారు. అయితే తిరిగి నగదు లభ్యత పెరుగడంతో డిజిటల్ పేమెంట్లూ తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే పెట్రో డిస్కౌంట్లను తగ్గించారు.

Posted in Uncategorized

Latest Updates