తగ్గిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. రూపాయి పతనం, అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులతో గోల్డ్ రేటు వరుసగా రెండో రోజు తగ్గింది. మంగళవారం (అక్టోబర్-9) రూ.220 తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.31,650కి చేరింది. స్థానిక నగల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడం కూడా బంగారం ధర పడిపోవడంపై ఎఫెక్ట్ చూపినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. రూ.50 తగ్గడంతో కిలో వెండి రూ.39,250కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోను బంగారం, వెండి ధరలు తగ్గాయి.

Posted in Uncategorized

Latest Updates