తగ్గిన వంటగ్యాస్ ధరలు

LPG-Gasవంట గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త. అటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నాలుగేళ్ల గరిష్టాన్ని తాకితే ఇటు వంట గ్యాస్‌ ధరలు దిగి వచ్చాయి. సబ్సిడీ LPG, నాన్‌ సబ్సిడీ వంటగ్యాస్ ధరలు తగ్గాయి. సబ్సిడీ సిలిండర్‌ రూ. 1.77 తగ్గగా, సబ్సిడీ లేని సిలిండర్‌ ధర (14.2 కిలోల) రూ.35.36 లు తగ్గింది. అన్ని మెట్రో నగరాల్లో ఏప్రిల్‌ 1 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ సిలిండర్‌ ధరలను తగ్గించడం ఇది నాలుగవ సారి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్‌సైట్‌ అందించిన సమాచారం ప్రకారం వంటగ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి.
నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర

ఢిల్లీ- రూ.653.5
కోలకతా – రూ.676
ముంబై – రూ.625
చెన్నై- రూ. 663.5
హైదరాబాద్‌ – 705.00

సబ్సిడీ సిలిండర్‌ ధర
ఢిల్లీ – రూ. 491.35
కోలకతా – రూ. 494.33
ముంబై – రూ. 489.04
చెన్నై- 479.44
హైదరాబాద్‌ – 489.50
మరోవైపు ప్రభుత్వ రంగ ఇంద్రప్రస్థ గ్యాస్ ఢిల్లీలో సిఎన్‌జీ పీఎన్‌జీ (పైప్డ్‌ సహజ వాయువు) ధరలను పెంచేసింది. ఏప్రిల్ 2 నుంచి సీఎన్‌జీ కిలోకు 90 పైసలు, స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సిఎం) కు 1.15 రూపాయలు పెంచింది.

Posted in Uncategorized

Latest Updates