తగ్గిన వోడా ఫోన్, ఏయిర్ టెల్ చార్జీలు

 వోడాఫోన్, ఏయిర్ టెల్ లు తమ ప్రీ పేయిడ్ ప్లాన్స్ ను సవరించాయి. ఇందులో భాగంగ రెండు టారీఫ్ ల చార్జీలను తగ్గించాయి.

వోడాఫోన్ తన రూ.199, రూ399 రిచార్జ్ ప్లాన్స్ లో మరింత వెసులుబాటు కల్పించింది. రూ.199 గా ఉన్న ప్లాన్ ను 169కి కుదించింది. రూ.199 లో ఉన్న డేటా, టాక్ టైమ్ ను యదావిధిగా రూ.169 లో లభించనున్నాయి. దీంతో పాటే.. రూ.399 ప్లాన్ లో కూడా సవరణలు చేసింది. ఇదివరకు ఉన్న 84 రోజుల వ్యాలిడిటీని 100 రోజులకు పెంచింది, డేటానూ 60GB నుండి 84GBకి పెంచింది.

ఏయిర్ టెల్ కూడా తన ప్లాన్స్ ను సవరించింది. రూ.488 ప్రీ పేయిడ్ ప్లాన్ ప్రస్తుతం 82 రోజుల వ్యాలిడిటీ తో పాటు ప్రతీ రోజు 100 లోకల్, నేషనల్ SMS లు చేసుకోవచ్చు. ఇప్పుడు రోజుకు 1.5 GB డైటా లభించగా.. ఇంతకు ముందు 1.4 GB డేటానే లభించేది. సవరించిన డేటాతో రోజుకు 100 MB ఎక్కువగా వస్తుంది.

 

Posted in Uncategorized

Latest Updates