తగ్గు తగ్గు…ఇంకా తగ్గాలి : దిగొస్తున్న బంగారం ధరలు

GPమొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు..ఇప్పుడు దిగొస్తున్నాయి. తులం బంగారం 32 వేల మార్క్ దాటిన  ధరలు.. మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. పండుగల సీజన్ నాటికి..తులం 34వేల మార్క్ టచ్ చేస్తుందన్న వార్తలు రావడంతో తగ్గుముఖం పట్టాయి.

బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. గతంలో 34 వేల గరిష్టానికి చేరిన బంగారం ధరలు.. కాస్త తగ్గుతూ వచ్చాయి. గత వారం పదిరోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకేరోజు 180 రూపాయలు తగ్గింది. ధరలు దిగొస్తేనే.. అమ్మకాలు బాగుంటాయంటున్నారు వ్యాపారులు. పెళ్ళిళ్ల సీజన్ వస్తుండడంతో రేట్లు తగ్గితే అమ్మకాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.  హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 31 వేల 250 రూపాయిలు ఉంది. ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం.. 29 వేల 140 రూపాయిలుగా ఉంది.  కేజీ సిల్వర్ 42 వేలు పలుకుతోంది.

రేట్లు తగ్గుతుండటంతో బంగారు షాపులు జనంతో కళకళలాడుతున్నాయి. దిగొస్తున్న బంగారం ధరలు మరింత తగ్గి… ఆర్నమెంట్ 28 వేలకు రావాలంటున్నారు. పెళ్లిళ్ల సీజన్, శ్రావణమాసం వస్తుండడంతో కావాల్సినంత  బంగారం కొనాలంటే ధరలు అందుబాటులో ఉండాలంటున్నారు. ధరలు ఎంత వరకూ తగ్గుతాయనేది చెప్పలేమంటున్నారు ట్రేడర్స్. ఆర్నమెంట్ బంగారం 28 వేలకు దిగొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు.  గోల్డ్ దిగుమతులు తగ్గడం ధరలు తగ్గడానికి కారణంగా కనిపిస్తుందని అంటున్నారు. తగ్గుతున్న ధరలు.. మరింత దిగొస్తాయనే ఆలోచనలో ఉన్నారు జనం.  అప్పుడే కొనుగోలు చేయాలని కొందరు అనుకుంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates