తగ్గే సమస్యే లేదు : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. శనివారం (అక్టోబర్-13)కూడా దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోలు ధరలు పెరిగాయి. హైద‌రాబాద్‌ లో లీట‌ర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి రూ.87.63, డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.81.79 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 18 పైసలు పెరిగిన లీటరు పెట్రోల్ ధర రూ.82.66, డీజిల్ 29 పైసలు పెరిగి రూ.75.19 కి చేరింది. ముంబైలో 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.87.94, డీజిల్ ధర 31 పైసలు పెరిగి రూ.78.82 కి చేరింది.

Posted in Uncategorized

Latest Updates