తగ్గొద్దు.. దూసుకెళ్లండి : రహదారులపై స్పీడ్ లిమిట్ పెంపు

SPEED 120దేశంలోని ఎక్స్ ప్రెస్ వేస్ పై స్పీడ్ లిమిట్ ను పెంచింది కేంద్రం. రహదారులపై వాహనాల వేగ పరిమితిని పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎక్స్‌ప్రెస్‌ వేస్‌ పై ఇంతవరకూ గంటకు 100 కి.మీ. ఉన్న స్పీడ్‌ లిమిట్‌ ఇక నుంచి 120 కిలో మీటర్లు ఉండనుంది. ఇక జాతీయ రహదారులపై స్పీడ్ లిమిట్ కూడా గంటకు 100 కిలో మీటర్లకు పెంచింది. నగరాల్లోని రోడ్లపై గరిష్ఠంగా 70 కి.మీ. వేగంతో ప్రయాణించ్చు.

8 సీట్లకు మించని ఎం-1 కేటగిరీకి చెందిన అన్ని వాహనాలకూ ఈ లిమిట్ వర్తిస్తుంది. ట్యాక్సీలకు.. ఎక్స్‌ప్రెస్‌ వేలపై వేగ పరిమితిని గంటకు 80 నుంచి 100 కిలోమీటర్లకు పెంచినట్లు తెలిపింది. జాతీయ రహదారులపై ట్యాక్సీలు గంటకు 90 కి.మీ… నగరాల్లో గరిష్ఠంగా 70 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని కేంద్ర రోడ్డు రవాణా- రహదారుల శాఖ నోటిఫికేషన్‌ వెల్లడించింది.

ఎక్స్‌ప్రెస్‌ వేలు, జాతీయ రహదార్లకు మాత్రమే ఇవి వర్తిసాయి. ప్రమాదకరమైన మలుపుల దగ్గర, కనిష్ఠవేగాన్ని పాటించాల్సిన ప్రాంతాలు, పట్టణ, గ్రామం నుంచి రహదార్లు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన గరిష్ఠవేగాన్ని మించకూడదు.

Posted in Uncategorized

Latest Updates