తనను ఎదిరించే ధైర్యంలేకనే తప్పుడు ఆరోపణలు : వివేక్ వెంకటస్వామి

తనను ఎదిరించే ధైర్యం లేని వాళ్లు తప్పుడు ఆరోపణలతో కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు HCA మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు డబ్బుల్లేని సమయంలో విశాక ఇండస్ట్రీస్ తరఫున స్పాన్సర్ షిప్ ఇప్పించామనీ, కానీ అర్షద్ ఆ ఒప్పందాన్నిరద్దు చేశారనీ చెప్పారు. ఆర్బిటరీ అమౌంట్ కంటే తక్కువ మొత్తం తీసుకున్నా.. వీహెచ్ ఎక్కువ డబ్బులు తీసుకున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీహెచ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోందన్నారు. వీహెచ్ ఆరోపణలు రుజువుచేస్తే డబుల్ అమౌంట్ ఇస్తాననీ, లేకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలన్నారు వివేక్.

Posted in Uncategorized

Latest Updates