తనిఖీల్లో బయటపడిన వాస్తవం : మల్టీప్లెక్స్, థియేటర్లలో రేట్లు ఏమీ మారలేదు

కాచిగూడ ఐనాక్స్ లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన ప్రమాణాలు పాటించకుండా.. అధిక ధరలకు వస్తువులను అమ్ముతున్నట్లు గుర్తించారు. నెట్ క్వాంటిటీ, ఎమ్మార్పీ ధరలను నిర్ణయించకుండా అమ్ముతున్న వస్తువుల శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐనాక్స్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.

ఇక కాప్రా సర్కిల్ లోని మల్టీప్లెక్స్ లు, థియేటర్లలో కూడా మేడ్చల్ తూనికలు, కొలతలశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారని గుర్తించారు. యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. ఉప్పల్ ఏషియన్ థియేటర్ లో తనిఖీలు చేసి.. రెండు కేసులు నమోదు చేశారు. ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates