తన ప్రతిష్ఠ కోసం : మహనీయుల త్యాగాలను ఓ కుటుంబం తొక్కిపెట్టిందన్న మోడీ

modi2.0దేశంలో ఒక కుటుంబం తన ప్రతిష్ట పెంచుకోవడం కోసం… ఎందరో మహనీయుల త్యాగాలను తొక్కిపెట్టిందని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్థంతి సందర్భంగా… ఆయనకు మోడీ నివాళులర్పించారు. మధ్యప్రదేశ్ లో పర్యటించిన మోడీ రాజ్ గఢ్ జిల్లాలో మోహన్ పురా ప్రాజెక్టును ప్రారంభించారు. 4వేల కోట్ల విలువైన వివిధ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగాలను స్మరించుకున్నారు మోడీ. మధ్యప్రదేశ్ ను అభివృద్దిలో ఉన్నతస్ధాయిలో నిలబెట్టేందుకు సీఎం శివరాజ్ సింగ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైందన్నారు. రాష్ట్ర అబివృద్ది కోసం శివరాజ్ సింగ్ చౌహాన్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు.  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను అభినందించారు మోడీ.

 

Posted in Uncategorized

Latest Updates