తప్పిన పెను ప్రమాదం : ఆకాశంలో దగ్గరగా రెండు ఇండిగో విమానాలు

ఆకాశంలో దగ్గరగా వచ్చిన రెండు ఇండిగో విమానాలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రెండు విమానాల్లోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు లో ఈ ఘటన జరిగింది.

మంగళవారం(జులై-10)  6ఈ 779(కోయంబత్తూరు-హైదరాబాద్), 6ఈ 6505(బెంగళూరు-కొచ్చి) ఇండిగో విమానాలు బెంగళూరు ఎయిర్‌ స్పేస్‌ పరిధిలో దగ్గరగా వచ్చాయి. రెండు విమానాల మధ్య వర్టికల్‌ సపరేషన్‌ 200 అడుగులు మాత్రమే ఉంది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. పైలట్లకు ట్రాఫిక్‌ కొలిషన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌ ద్వారా హెచ్చరికలు జారీచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ దీనిని గుర్తించడం కొంచెం ఆలస్యమైనా సెకన్లనో ఘోర ప్రమాదం జరిగి ఉండేది.

 

Posted in Uncategorized

Latest Updates