తప్పిన ప్రమాదం : సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మంటలు

hhసీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో ప్రమాదం తప్పింది. మంగళవారం (ఫిబ్రవరి-27) కరీంనగర్ లో సీఎం బయలుదేరే సమయానికి హెలికాప్టర్ లోపలున్న ఓ బ్యాగు నుంచి హఠాత్తుగా పొగలు వచ్చాయి. అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ బ్యాగును దూరంగా తీసుకెళ్లి పడేశారు. హెలికాప్టర్ లో సెక్యూరిటీ సిబ్బంది వాడే కమ్యూనికేషన్ సెట్ లో షార్ట్ సర్క్కూట్ కారణంగా పొగలు వచ్చినట్లు చెబుతున్నారు.

సీఎం కాన్వాయ్‌లోని వైర్‌లెస్ సెట్ నుంచే ఈ మంటలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది బ్యాటరీ ఓవర్ హీట్ కావడంతో అకస్మాత్తుగా పొగలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ గాల్లోకి లేవకముందే బ్యాగ్‌ను బయటపడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది..

Posted in Uncategorized

Latest Updates