తప్పిన రైలు ప్రమాదం: ఇంజిన్ లేకుండానే 15కిలోమీటర్లు ప్రయాణం

Ahmadabad-Puri-Expressఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ లేకుండానే 15 కిలో మీటర్లు ప్రయాణించింది. అయితే సిబ్బంది అలర్టయి చివరకు రైలును నిలిపేశారు. 22 బోగీలు ఇంజిన్‌ లేకుండా దాదాపు 15కిలోమీటర్లు వరకు వెళ్లాయి.

టిట్లాగఢ్‌ దగ్గర ఇంజిన్‌ చేంజ్ చేసే టైంలో అప్రమత్తంగా ఉండకపోవటంతో రైలు దానంతట అదే పరుగులు తీసింది. వేగంగా కేసింగా ప్రాంతం వైపు దూసుకెళ్లిపోయింది. రైలు ఇంజిన్‌ లేకుండా వెళ్తున్న విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు స్టేషన్‌ సిబ్బందికి సమాచారం అందించారు. మరోవైపు రైల్లో ఉన్న ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు పెట్టారు.  చివరకు పట్టాలపై రాళ్లను ఉంచిన అధికారులు.. రైలు నిలిచిపోయేలా చేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికలు సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు. చివరకు కేసింగ నుంచి మరో ఇంజిన్‌ అమర్చి బోగీలను అధికారులు టిట్లాగఢ్‌కు తీసుకొచ్చారు. బ్రేకర్లు సరిగ్గా వేయకపోవటమే ఘటనకు కారణమన్న అధికారులు.. బాధ్యులైన ఏడుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates