తప్పు ఒప్పుకున్న అమిత్ షా

amit-shaHఇటీవల నోరు జారి అడ్డంగా బుక్కైన BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన కామెంట్స్ పై స్పందించారు. యెడ్డీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా  చెప్పటం తన పొరపాటే అన్నారు అమిత్ షా. శుక్రవారం (మార్చి-30)  మీడియాతో ఆయన మాట్లాడుతూ… సిద్ధరామయ్య ప్రభుత్వం అనబోయి పొరపాటున యాడ్యురప్ప అని నేను అన్నాను. అవును.. నేను తప్పు చేశా. అయితే, కర్ణాటక ప్రజలు మాత్రం తప్పు చెయ్యబోరు. బీజేపీకి పట్టం కట్టి కాంగ్రెస్‌ అవినీతి పాలనకు చరమ గీతం పాడతారు అని చెప్పారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ షా పొరపాటున యెడ్డీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా మాట్లాడటం..  వెంటనే సవరించుకుని ఆయన సిద్ధరామయ్య అని చెప్పటం తెలిసిందే.

 

.

Posted in Uncategorized

Latest Updates