తమిళనాడులో ఘోరం : స్టూడెంట్స్ పైకి దూసుకెళ్లిన ఆటో…ఏడుగురు మృతి

తమిళనాడు కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం(ఆగస్టు-1) ఉదయం పెరియార్ బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్న స్కూల్ స్టూడెంట్స్ పైకి ఓ ఆటో దూసుకెళ్లింది. దాన్ని తప్పించే క్రమంలో మరో కారు ఫుట్ పాత్ పై ఉన్నవాళ్లపైకి దూసుకెళ్లింది. యాక్సిడెంట్ భీతావహంగా మారింది. ఓ కరెంట్ పోల్ కు ఢీకొంది కారు. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవాళ్లలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులున్నారు. ఈ ఘటనలో ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు.

 

Posted in Uncategorized

Latest Updates