తమిళనాడు సంచలనం : తూత్తుకుడి కాపర్ ఫ్యాక్టరీ మూసివేత

STEప్రజా ఉద్యమానికి తమిళనాడు ప్రభుత్వం తలవంచింది. తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ కొన్ని నెలలుగా ఉద్యమం నడుస్తోంది. గత వారం అయితే పోలీస్ కాల్పుల వరకు వెళ్లింది. పోలీస్ కాల్పుల్లో 13 మంది చనిపోయారు. ఆ తర్వాత పరిస్థితులు, పరిణామాలు వేగంగా మారిపోయాయి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయి. ధర్నాలు, నిరసనలతో హోరెత్తించాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది.

ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాల వల్ల కాన్సర్ వస్తుందంటూ స్థానికులు పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనలకు తమిళనాడు సర్కార్ దిగి వచ్చింది. వెంటనే ఫ్యాక్టరీని మూపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జీవో కూడా జారీ చేసింది. ఇప్పటికే విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశాం అని స్పష్టం చేసింది. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యావరణ అనుమతులను కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు షాకింగ్ కు గురి చేసింది. స్టెరిలైట్ ఫ్యాక్టరీ విస్తరణకు ఇప్పటికే బ్రేక్ వేసింది హైకోర్టు. విస్తరణ చేపట్టకూడదని స్టే కూడా విధించింది. ఇప్పుడు ఏకంగా ఫ్యాక్టరీనే మూసివేస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం అయ్యింది. ఈ ఫ్యాక్టరీ మూసివేతతో.. 35వేల మంది ఉపాధి కోల్పోనున్నారు.  ప్రత్యక్షంగా 5,500 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. వీళ్లందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపించటం కూడా ఇప్పుడు పెద్ద సవాల్.

Posted in Uncategorized

Latest Updates