తమిళ శ్రీమంతుడు…కమల్ హాసన్

kamal adoptతమిళ స్టార్… మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు.ఈ క్రమంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడులోని 32 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామం చొప్పున దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా కమల్ ఓ యువతిని దత్తత తీసుకున్నారు. అధిగత్తూరు గ్రామానికి చెందిన దినసరి కూలీ ముత్తు కుమార్తె సునిత అనే యువతిని దత్తత తీసుకున్నారు. సునీత తండ్రి చనిపోయాడు. తల్లి మాత్రమే ఉంది. పైచదువులు చదివించే స్తోమత లేకపోవడంతో సునిత మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.మూడేళ్లు ఉచితంగా చదివిస్తానని ఆపై పోషణ బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. సునితను తిరునిండ్రవూర్‌లోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీలో చేర్పించారు కమల్.

Posted in Uncategorized

Latest Updates