తమిళ సీఎంపై సీబీఐ దర్యాప్తుకి మద్రాస్ హైకోర్టు ఆదేశం

రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులు కేటాయించడంలో అవినీతికి పాల్పడ్డారంటూ తమిళనాడు సీఎం పళనిస్వామిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో వీటిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని శుక్రవారం మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. . సీఎం పళనిస్వామి తన అధికారాన్ని ఉపయోగించి రూ. 3,500కోట్ల ప్రాజెక్టులను తన బంధువులు, బినామీలకు కేటాయించారని ప్రతిపక్ష డీఎంకే ఆరోపించింది. దీనిపై డీఎంకే ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌ ఎస్ భారతి డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌(DVAC)కి కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో సీఎంపై DVAC విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేకపోవడంతో పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన  కోర్టు DVAC తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వారం రోజుల్లో సీబీఐకి అప్పగించాలని DVAC కి సూచించింది. మూడు నెలల్లోగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేయాలని సీబీఐని ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates