తమ పిల్లలున్నారన్న ఆశతో…..యాదాద్రికి క్యూ కట్టిన తల్లిదండ్రులు.

వివిధ ప్రాంతాల్లో తప్పిపోయిన చిన్నపిల్లల ఆచూకీ కోసం యాదాద్రికి క్యూ కట్టారు తల్లిదండ్రులు. యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహాల నుంచి చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పిస్తున్నారు. వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలించారని తెలుసుకున్న కొందరు… రెస్క్యూ చేసిన పిల్లల్లో తమ వాళ్ళు కూడా ఉండొచ్చనే ఆశతో పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు. వ్యభిచార నిర్వాహకుల నుంచి కాపాడిన ఓ అమ్మాయి తమ కూతురే అంటూ ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కూతురుతో ఉన్న ఫ్యామిలీ ఫొటోను పోలీసులకు చూపించారు. అయితే దీనిపై విచారణ… చేసి పిల్లలను అప్పగిస్తామన్నారు పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates