తర్వాత ఏంటీ : 31తో ముగుస్తున్న జియో ప్రైమ్ ఆఫర్

jio

జియో. ఇండియాలో 4G విప్లవానికి నాంది. భారతీ మొబైల్ ముఖచిత్రాన్నే మార్చేసింది. జియో ప్రైమ్ మెంబర్ షిప్.. ద్వారా బోలెడు ఆఫర్స్ ఇచ్చింది. 99 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే వచ్చే ప్రయోజనాలు బోలెడు. 2018 మార్చి 31వ తేదీ వరకు జియో మెంబర్ షిప్ డ్రైవ్ నడిచింది. ఇప్పుడు దానికి టైం ముగిసింది. మరో నాలుగు రోజుల్లో ప్రైమ్ ఆఫర్ గడువు ముగుస్తుండటంతో.. జియో కొత్త ఆఫర్ ఎలా ఉండబోతున్నది అనేది కస్టమర్లకే కాకుండా.. మిగతా టెలికాం కంపెనీలకు ఆసక్తి రేపుతోంది.

మొదటిసారే షాక్ ఇచ్చి.. దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లను నష్టాల్లోకి నెట్టింది జియో. ఏప్రిల్ ఒకటి నుంచి తీసుకురాబోయే కొత్త ఆఫర్ ఎలా ఉంటుంది.. ఎన్ని సంచలనాలకు తెర తీస్తోందో అని నిపుణులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటీవల నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చిన జియో.. ఈసారి సంచలనాల జోలికి పోకపోవచ్చని కూడా చెబుతున్నారు మరికొందరు. ప్రస్తుతం ఉన్న ప్రైమ్ ఆఫర్ ను కొనసాగిస్తూ.. ఏదైనా ఒకటీ, రెండు కొత్త ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

జియో 2017 డిసెంబర్ నాటికి 16 కోట్ల మంది కస్టమర్లతో నెంబర్ వన్ గా నిలిచింది. అతి తక్కువ కాలంలో జియో ప్రజల్లోకి ఎంతగా వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. మార్చి 31తో ప్రైమ్ ఆఫర్ ముగుస్తుంది. అయితే కొత్త ఆఫర్లపై జియో నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో రెండు రోజుల్లో కొత్త ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా..

Posted in Uncategorized

Latest Updates