తలలపై తుపాకి పెట్టి మరీ : సామాజిక మహిళా కార్యకర్తలపై అత్యాచారం

jharkhand-rapeవాళ్లు మనుషులా.. పశువులా.. జరిగిన ఘోరం అయితే మాత్రం.. వాళ్లు రాక్షసులే అనొచ్చు.. ఊరును బాగుచేద్దాం అని.. తప్పుడు పనులు చేయొద్దంటూ ఊరి ప్రజల్లో మార్పు కోసం వచ్చిన సామాజిక మహిళా కార్యకర్తలపైనే అత్యాచారానికి తెగబడ్డారు దుర్మార్గులు.. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్ రాష్ట్రం కుంతీ జిల్లా చోచాంగ్ గ్రామానికి ఓ NGO స్వచ్ఛంద సంస్థ బృందం వెళ్లింది. మొత్తం 11 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు మహిళలు. మానవుల అక్రమ రవాణా, పిల్లల అమ్మకం, వ్యభిచార కూపంలోకి మహిళలను తరలించటం వంటి అంశాలపై అవగాహన కల్పించటం వారి పని. అందులో భాగంగానే గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించటానికి వచ్చారు. గ్రామంలోకి వచ్చిన 11 మంది స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలపై దాడి చేశారు దుండగులు. తుపాకులు గురి పెట్టి మగాళ్లను చితకబాదారు. అంతటితో ఆగలేదు ఆ దుర్మార్గులు.

బృందంలోని ఐదుగురు మహిళలను బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లారు. ప్రతిఘటించిన వారిపై తలలపై తుపాకులు గురి పెట్టారు. వస్తారా.. చంపేయమంటారా అని బెదిరించారు. అడ్డుకోబోయిన పురుషులను కొట్టటమే కాకుండా.. ఎదురు తిరిగితే మహిళలను చంపేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. సామూహిక అత్యాచారానికి తెగబడినట్లు పోలీసులు సైతం వెల్లడించారు. ఇప్పటికే ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాం అని డీఐజీ అమోల్ హోంకర్ ప్రకటించారు. విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వైద్య పరీక్షలు చేశాం అని.. మిగతా నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates