తల్లికి పాముకాటు.. బిడ్డ కూడా మృతి

SNAKEచనిపోతున్నామని వారికి తెలియదు. నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరిచింది. నిద్రలోనే ఆ మహిళ మరణించగా.. ఆమె పాలు తాగిన బిడ్డ కూడా మరణించింది. ఈ యధార్థ సంఘటన చూసిన ప్రతి ఒక్కరినీ కన్నీటిని పెట్టించింది. గురువారం (మే-24) రాత్రి ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 35ఏళ్ల మహిళ నిద్రలో ఉండగా పాము కాటుకు గురైంది. నిద్రలో ఏదో పురుగు కుట్టి ఉంటుందనుకున్న ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుంది. పట్టించుకోలేదు.

ఆ తర్వాత తన మూడేళ్ల చిన్నారికి పాలు ఇచ్చింది. పాము కాటు ద్వారా అప్పటికే తల్లి శరీరంలోకి ప్రవేశించిన విషం.. పాల ద్వారా బిడ్డ శరీరంలోకి విషం వచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. చాలాసేపటి తర్వాత తీవ్ర అస్వస్థతతో ఉన్న వీరిని కుటుంబ సభ్యులు గమనించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చినిపోయినట్లు తెలిపారు వైద్యులు. ఆ తర్వాత ఇల్లు మొత్తం గాలించగా.. గదిలోని ఓ మూల పామును గుర్తించారు. తల్లీ కూతురు నిద్రిస్తున్నట్లుగా ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates