తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడని తల నరికేశాడు

కర్ణాటకలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో ఫ్రెండ్ తల నరికేశాడు ఓ యవకుడు. మండ్య జిల్లాలోని మలవల్లి తాలుకాలోని చిక్కబాగలులో శనివారం(సెప్టెంబర్) ఈ ఘటన జరిగింది.
చిక్కబాగలుకి చెందిన పశుపతి (28), హతుడు గిరీశ్‌ (38) స్నేహితులు. గిరీశ్ కి వివాహమై నాలుగు నెలల కూతురు ఉంది. పశుపతికి ఇంకా పెళ్లి కాలేదు. మూడు రోజుల క్రితం గిరీశ్ తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంతో అతడిపై పగ పెంచుకున్నాడు పశుపతి. గిరీశ్ ను చంపేందుకు ప్లాన్ చేశాడు పశుపతి. శనివారం(సెప్టెంబర్-29) ఉదయం బజారుకు వెళ్లి కాఫీ తాగి వద్దాం అంటూ గిరీశ్ ను తన బైక్ పై ఎక్కించుకొని ఊరు చివరకు తీసుకెళ్లాడు. తన వెంట తెచ్చుకొన్న గొడ్డలితో గిరీశ్ తల నరికేశాడు పశుపతి. గిరిశ్‌ తలతో నిబ్బరంగా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీఎస్‌ కు బైక్‌ పై వచ్చి పశుపతి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న బెళకవాడి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గిరీశ్ తలతో స్టేషన్ లోకి వస్తున్న పశుపతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్ణాటకలో ఈ నెలలో ఇలాంటిది జరగడం మూడోసారి. నాలుగురోజుల క్రితం చిక్కబల్లాపూర్ జిల్లాలో భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందున్న అనుమానంతో ఆమె తల నరికి….తల పట్టుకొని వచ్చి స్టేషన్ లో లొంగిపోయాడు ఓ వ్యక్తి.

Posted in Uncategorized

Latest Updates