తల్లి, కూతురిపై 18 మంది అత్యాచారం…ఏడుగురు పోలీసులు కూడా

హర్యానాలో దారుణం జరిగింది. ఓ తల్లి, 15 ఏళ్ల కూతురిపై 18 మంది కామాంధులు రెండు నెలలుగా సామూహికంగా అత్యాచారం చేశారు. కైథాల్ కలాయత్ సిటీకి దగ్గర్లోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు 18 మంది కామాంధులపై కేసు నమోదు చేశారు. రేప్ చేసిన వారిలో ఏడుగురు పోలీసులు, గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచులు కూడా ఉన్నట్లు కైథాల్ ఎస్పీ అస్తామోదీ తెలిపారు.

నిందితుల్లో ఏఎస్ఐ షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతిలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందతుల్లో ఏడుగురు హర్యానా పోలీసులు ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates