తస్సాదియ్యా..! ‘వినయ విధేయ రామ’ సాంగ్ విడుదల

రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాలో రెండో పాట విడుదలైంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో “తస్సాదియ్యా.. లెట్స్ డు ద మామామియ్యా” అంటూ సాగే పాటను శ్రీమణి రాశాడు. ‘ఇండియన్ ఐడల్’  సింగర్ జస్ ప్రీత్ జాస్జ్ ఈ పాట పాడాడు. పాట వింటుంటే… ఇదే సింగర్. ఖైదీ నంబర్ 150 సినిమాలో పాడిన ‘సుందరీ’ పాట మదిలో మెదులుతుంది. దేవిశ్రీ చెప్పినట్టే ఇది మంచి బీట్ ఉన్న ట్యూనే. వివేక్ ఒబెరాయ్ ఈ మూవీలో కీరోల్ పోషిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates